RNI N. MPHIN/2013/52360; प्रधान संपादक - विनायक अशोक लुनिया

తిమ్మప్ప దేవాలయం పునః నిర్మాణ భూమి పూజ మహోత్సవం

తిమ్మప్ప దేవాలయం పునః నిర్మాణ భూమి పూజ మహోత్సవం

सच्चा दोस्त न्यूज़ को आप हिंदी के अतिरिक्त अब इंग्लिश, तेलुगु, मराठी, बांग्ला, गुजरती एवं पंजाबी भाषाओँ में भी खबर पढ़ सकते है अन्य भाषाओँ में खबर पढ़ने के लिए निचे दिए गए लिंक पर क्लिक करें Sachcha Dost News https://sachchadost.in/english सच्चा दोस्त बातम्या https://sachchadost.in/marathi/ సచ్చా దోస్త్ వార్తలు https://sachchadost.in/telugu/ સચ્ચા દોસ્ત સમાચાર https://sachchadost.in/gujarati/ সাচ্চা দোস্ত নিউজ https://sachchadost.in/bangla/ ਸੱਚਾ ਦੋਸਤ ਨ੍ਯੂਸ https://sachchadost.in/punjabi/

दैनिक राशिफल दिनांक 13 जुलाई (बुधवार) 2022 https://sachchadost.in/archives/93913

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని అతి పురాతనమైన తిమ్మప్ప దేవాలయం పునఃనిర్మాణం భూమి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా తపసి మురళి రెడ్డి ఆధ్వర్యంలో సాయి చందన దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తిమ్మప్ప దేవాలయం పునఃనిర్మాణ సమితి అధ్యక్షులు తపసి మురళి రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడాలలో ఒకటైన అతి పురాతనమైన తిమ్మప్ప దేవాలయాన్ని నిర్మించడం మాపూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, అంతటి విశిష్టత కలిగిన ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తిమ్మప్ప దేవాలయం చరిత్ర మరియు విశిష్టత గురించి అతి త్వరలో తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో పుస్తక ఆవిష్కరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. తిమ్మప్ప దేవాలయం పునః నిర్మాణ భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాట్లాడుతూ తిమ్మప్ప దేవాలయం పునర్నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తపసి మురళి రెడ్డి, వెంకటేష్ యాదవ్, వెంకటరమణ, ఓంకార్, దీన దయాల్ యాదవ్, మాజి సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, మేడసాని పురుషోత్తం నాయుడు, అవిలాల శ్రీధర్, శ్రీనివాసులు రెడ్డి, చక్రధర్ రెడ్డి,సోము యాదవ్, శ్రీను యాదవ్, మనీ యాదవ్ గూళూరు వినయ్, శ్రీకాంత్ గణేష్ యాదవ్ గుణ యాదవ్ భాను ప్రకాష్ మరియు తొండవాడ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: